మోటకొండూర్, నవంబర్ 17: స్థానికం ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా మోటకొండూరు మండలం చందేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సివిల్ కాంట్రాక్టర్ సుదగాని మల్లేశ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా సుదగాని మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి