531 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ 'చేయూత' పెన్షన్లు అందేలా కృషి చేస్తామని, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడైనా మంజూరు చేయిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక దామర బాలాజీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని 20 వార్డులకు చెందిన 531 మంది నూతన లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షన్లు రాని వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులు ఆందోళన చెందవద్దని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఎమ్మెల్సీ ఎన్.సత్యం మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకే ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి నిధులు తీసుకొస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి ప్రజలంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు.మంజూరైన 531 పెన్షన్లలో వితంతువులు 271, దివ్యాంగులు 105, చేనేత కార్మికులు 62, గీత కార్మికులు 55, ఒంటరి మహిళలు (వివాహితులు 36, అవివాహితులు 2) ఉన్నారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోశిక వినయ్‌కుమార్, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, సీఈవో శోభారాణి, కమిషనర్ వెంకటేశ్వరనాయక్, తహసీల్దార్ వీరభాయ్, ఎంపీడీవోలు శ్రీలత, ప్రమోద్‌కుమార్, ఎంపీవో చంద్రశేఖర్, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి, ఆర్వో అంజయ్య, కౌన్సిలర్లు కోసనం రాకేష్‌రెడ్డి, పాలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఉదరి యాదయ్య, కొయ్యడ శేఖర్, ఆలె శ్రీలత చిరంజీవి, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, బత్తుల వాణి విప్లవ్, ఉడుగు జ్యోతి రమేష్, గడ్డం ఇందిర రాజారత్నం, బత్తుల జయమ్మ దాసు, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, హన్ను మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగారాములు, సందగళ్ల విజయ, షేక్ సబీనా, బాబా షరీఫ్, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి