ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వహించిన నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఆయన సతీమణి లక్ష్మితో కలిసి హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఓంకార్ శాస్త్రి, ఆలయ కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందని, మానసిక ప్రశాంతత కోసమే తాను దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కమిటీకి హామీ ఇచ్చారు. నిత్య అన్నదానం నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు.కార్యక్రమంలో ఆర్డీవో శేఖర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ మస్తాన్ బాబు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయక్, మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, మాజీ అధ్యక్షుడు భాస్కర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తూర్పాటి శంకర్ గురుస్వామి, మాజీ ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు, మార్కెట్ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ పర్నె శివారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరి పరమేష్, కంచరకుంట్ల వెంకటరెడ్డి గురు స్వామి, కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, కొసనం రాకేష్‌రెడ్డి, పాక చిరంజీవి, ఎండీ హన్నుభాయ్, మాజీ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, పస్తం గంగారాములు, సందగళ్ల విజయ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి