దమ్ము చక్రాలు అమర్చిన ట్రాక్టర్లను రహదారులపైకి తీసుకురావద్దని మునగాల ఎస్సై సంజీవరెడ్డి మండలంలోని రైతులు, ట్రాక్టర్ యజమానులకు మంగళవారం సూచించారు.దమ్ము చక్రాల వల్ల కోట్లాది రూపాయలతో నిర్మించిన తారురోడ్లు దెబ్బతిని త్వరగా పాడవుతాయని తెలిపారు. అంతేకాకుండా రహదారులపై మట్టి, బురద పేరుకుపోవడంతో ఇతర వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజా ఆస్తులైన రహదారులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని ట్రాక్టర్ యజమానులను ఎస్సై కోరారు.
దమ్ము చక్రాల ట్రాక్టర్లతో రోడ్లపై ప్రయాణం వద్దు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి