Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఫ్యూచర్ సిటీలో పోలీస్ టీ20 క్రికెట్ టోర్నీ షురూ

Updated : 18 Nov 2026 04:26 IST
As Preferred Source 1 min read
ఫ్యూచర్ సిటీలో పోలీస్ టీ20 క్రికెట్ టోర్నీ షురూ

పోటీల్లో 21 పోలీసు జట్లు.. తొలి మ్యాచ్‌లో బాసర జోన్-2 విజయం

ఫ్యూచర్ సిటీ, నవంబర్ 17: స్థానికం ప్రతినిధి

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆతిథ్యంలో 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 (క్లస్టర్-బి) టీ20 క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఐపీఎస్ ప్రత్యేక చొరవతో పక్కా ప్రణాళిక రూపొందించి పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏడు క్రికెట్ మైదానాల్లో 21 పోలీసు జట్లు తలపడుతున్నాయి.

పెవిలియన్ క్రికెట్ గ్రౌండ్‌లో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఐపీఎస్ సమక్షంలో ఐజీ డాక్టర్ గజరావు భూపాల్, ఐపీఎస్ తొలి మ్యాచ్ టాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 17 నుంచి 20 వరకు నాలుగు రోజులపాటు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి, స్నేహభావం, ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా పోటీలను నిర్వహిస్తున్నారు.

తొలి రోజు పెవిలియన్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఫ్యూచర్ సిటీ పోలీసు జట్టుపై బాసర జోన్-2 జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి రోజు వివిధ మైదానాల్లో 12 లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.

ఈ నెల 18న లీగ్ మ్యాచ్‌లు, 19న క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, 20న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

Sthanikam

ఫ్యూచర్ సిటీలో పోలీస్ టీ20 క్రికెట్ టోర్నీ షురూ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి