ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి చేతులమీదుగా నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
కృతజ్ఞతలు తెలిపిన పీపల్ పహాడ్ సర్పంచ్ నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్, ఉపసర్పంచ్ శ్రవణ్ కుమార్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'చేయూత' పింఛన్ల పథకం నిరుపేదలు, నిస్సహాయుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని పీపల్ పహాడ్ గ్రామ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్, ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.పీపల్ పహాడ్ గ్రామానికి చెందిన వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి చేతులమీదుగా నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తూ, నూతన పింఛన్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పంపిణీ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ ఎర్ర పెంటయ్య, దేవాలయ ఛైర్మన్ తొర్పునూరి నర్సింహా, డైరెక్టర్లు పక్కీరు అంజిరెడ్డి, ఎర్ర వినోద్ కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎర్ర పరమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం అంజిరెడ్డి, సికిలమెట్ల మహేశ్వర్, నల్లెంకి రాజు, పిల్లి శేఖర్, పింఛన్ లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి