పెంపుడు కోడి కారు కింద పడి మృతి చెందడంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు. తన పెంపుడు కోడిని కారుతో ఢీకొట్టి చంపేశారని పౌడాల రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు.
కోడి మృతిపై పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి