గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం కోదాడ పట్టణంలోని పెద్దచెరువు వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా నిమజ్జన కేంద్రం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాలు వచ్చే మార్గాలు, వాహనాల రాకపోకలు, పార్కింగ్, విద్యుత్ మరియు లైటింగ్ ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.గణేష్ విగ్రహాలు వచ్చే, తిరిగి వెళ్లే మార్గాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వాహనదారులకు స్పష్టంగా తెలిసే విధంగా రూట్ మ్యాప్‌లు, మార్గ సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని ఆదేశించారు. నిమజ్జన కేంద్రం వద్ద తగినంత లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచాలని, నిమజ్జనానికి వచ్చే భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చని ఎస్పీ తెలిపారు. గణేష్ శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. శోభాయాత్ర మార్గంలో సాధారణ ప్రజలు, ఇతర వాహనాల రాకపోకలను అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ శోభాయాత్ర సమయంలో భక్తులకు, వాహనదారులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అన్ని శాఖల సమన్వయంతో, ప్రజల సహకారంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ శివ శంకర్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, పట్టణ ఎస్ఐలు, ఇతర శాఖ సిబ్బంది ఉన్నారు.
శోభాయాత్రలో యువత సంయమనం పాటించాలి
శోభాయాత్రలో యువత సంయమనం పాటించాలి
Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి