జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న అశోక్ సూపరింటెండెంట్, జహీరుద్దీన్ ఆర్ఎస్ఐ, ఎం. మల్లేశం హెడ్ కానిస్టేబుల్, పి. అశోక్ కానిస్టేబుల్‌లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి వారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమని, ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది పోలీసు శాఖలో వివిధ హోదాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహించి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. వారి సేవలు పోలీసు శాఖకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐలు సురేష్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, టీఎన్‌జీఓ అధ్యక్షుడు జావీద్ అలీ, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్, పదవీ విరమణ పొందుతున్న వారి కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సేవలు ప్రశంసనీయం.. పదవీ విరమణ సిబ్బందికి ఎస్పీ వీడ్కోలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి