నందికొండ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నప్రసాద వితరణ.
నాగార్జునసాగర్ సెప్టెంబర్ 23 (స్థానికం ప్రతినిధి):నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నందికొండ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సతీష్ హాజరై మహా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ.. సమాజ సేవలో యువత ముందుండటం అభినందనీయమన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం ఎంతో గొప్ప సేవ అని పేర్కొన్నారు. నందికొండ యూత్ సభ్యులు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాలకు తమ సమయాన్ని కేటాయించాలని పిలుపునిచ్చారు.
మహా అన్నప్రసాద వితరణకు భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నందికొండ యూత్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కార్యక్రమంలో నందికొండ యూత్ ప్రతినిధులు, స్థానిక యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో నందికొండ యూత్ సభ్యులు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి