చిట్యాల: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చిట్యాల పురపాలక కార్యాలయంలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు సిబ్బందిని ఘనంగా సత్కరించారు.
స్వీపర్లు ధనలక్ష్మి, ఆర్. అండాలు, డ్రైవర్లు ఆర్. నర్సింహ, జే. నర్సింహలను సన్మానించి అభినందించారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు దోహదపడతాయని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కమిషనర్ గురులింగం, కౌన్సిలర్లు సందీప రాంరెడ్డి, కోనేటి ఎల్లయ్య, షబానా అజీమ్, గాలి యాదమ్మ లింగయ్య, ఏర్పుల పరమేశ్, కోఆప్షన్ సభ్యులు సత్తయ్య, ఇమ్రాన్, షహజాది ఇబ్రహీం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేష్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి