సాటి లేని జాతి నిర్మాత బీ. ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
సాటి లేని జాతి నిర్మాత బీ. ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
Sthanikam District Staff Reporter
టియూ డబ్ల్యూ జే (హెచ్-143) రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్.
మహనీయుడి ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్న మోడీ పాలన.
- వడాయిగూడెంలో ఘనంగా అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని వడాయిగూడెం గ్రామంలో మంగళవారం రోజు గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్,గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓం ప్రకాష్,ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోట అంజయ్యలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానిక పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గుండు ముత్తయ్య గౌడ్ మాట్లాడుతూ..సామాజిక సంస్కర్తగా,భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా,భారత దేశపు తొలి న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ పోషించిన పాత్ర మన జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించిందన్నారు. నేడు ఆయన 135వ జయంతిని దేశం మొత్తం గొప్పగా జరుపుకుంటుందని పేర్కోన్నారు. ప్రతి పౌరుడిని జాతి నిర్మాణంలో భాగమయ్యేలా కృషి చేసేందుకు అడుగులు వేయించడంలో ఆయన ఆలోచనలోని అసాధారణ స్ఫూర్తి ప్రేరణ చాలా ఉపయోగపడతాయని తెలిపారు.భారత 77 ఏళ్ల స్వతంత్రాన్ని పురస్కరించు కొని దేశవ్యాప్తంగా 'స్వాతంత్ర్య అమ్మత మహోత్సవాలు' జరుపుకుంటున్న నేపథ్యంలో అంబేద్కర్ ఆలోచనలోని గాంభీర్యాన్ని జాతి నిర్మాతగా ఆయన పోషించిన పాత్ర,దేశాన్ని గొప్ప శక్తిగా ఎదిగేలా, సామాజికంగా అన్ని వర్గాలను బలోపేతం చేసేలా ఆయన పోషించిన పాత్ర,దేశాన్ని గొప్ప శక్తిగా ఎదిగేలా,సామాజికంగా అన్ని వర్గాలను బలోపేతం చేసేలా ఆయన చేపట్టిన చర్యలను పరిపూర్ణంగా ప్రతిఫలింప చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని పేర్కోన్నారు.ఆర్థికవేత్తగా,చురుకైన రాజకీయ నాయకుడిగా,ప్రసిద్ధ న్యాయవాదిగా,గొప్ప జాతీయ చట్టసభ సభ్యుడిగా,అద్భుతమైన పండితుడిగా,విజ్ఞాన ఖని ఆయన ఆచార్యుడిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన దేశం నిర్మాణానికి అసాధారణ కృషి చేశారని తెలిపారు.పంచాయతీ సెక్రటరీ ఆమని,ఉప సర్పంచ్ సుక్కల శంకర్,వార్డు సభ్యులు బబ్బూరి సభిత,పబ్బాల ఉమ, బబ్బూరి భరత్ గౌడ్,కోట సుధాకర్,కోట సుధావాణి,కోట దీప,నాయకులు రాసాల నర్సింహ యాదవ్,జక్కుల చంద్రయ్య యాదవ్,గుండు రవి,మాజీ సర్పంచ్ కోట పెద్ద స్వామి,ఎమ్మార్పీఎస్ నాయకులు కోట చంద్రశేఖర్,కోట చిన్న స్వామి,కోట ఉపేందర్,కోట అంజనేయులు,కోట సుధాకర్,కోట స్వామి దాసు,కోట పోషయ్య,కోట ముత్యాలు,కోట రాజయ్య,కోట యాదగిరి,కోట భాను,కోట సాయి,కోట వెంకటేష్,కోట చందు,నోముల నర్సింహ తదితరులున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి