Sthanikam - Truth Matters
Logo

స్తంభం ఏర్పాటు చేశారు.. వీధి దీపం వేయడం మరిచారు!

Updated : 02 Nov 2026 09:24 IST
As Preferred Source 1 min read
స్తంభం ఏర్పాటు చేశారు.. వీధి దీపం వేయడం మరిచారు!

చీకట్లో శ్రీరామ్ నగర్ కాలనీ వాసుల అవస్థలు.. చిన్నారులకు తప్పని ఇబ్బందులు.

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని 9వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో వీధి దీపం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి వైర్లు సైతం లాగినప్పటికీ, ఇప్పటివరకు వీధి దీపాన్ని ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళల్లో కాలనీ మొత్తం చీకటిమయంగా మారడంతో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే వీధి దీపాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డిని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక, వడ్డేపల్లి గంగయ్య, గోలి కిష్టయ్య, గోలి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్తంభం ఏర్పాటు చేశారు.. వీధి దీపం వేయడం మరిచారు!

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news