Sthanikam - Truth Matters
Logo

జాతీయవాదుల సంఘం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Updated : 02 Nov 2026 11:53 IST
As Preferred Source 1 min read
జాతీయవాదుల సంఘం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

చిట్యాల: బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయవాదుల సంఘం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయిన మహాలింగం యాదవ్, చికిలమెట్ల అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న గౌడ్, జయరాపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, బీజేపీ నాయకులు గోషిక వెంకటేశం, ఈడుదల మల్లేష్, కంచర్ల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చిట్యాల మండలానికి చెందిన డాక్టర్ పాశం వెంకటేశ్వర్లు కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌చార్జిగా ఎన్నికైన సందర్భంగా రేపు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు నాగోల్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయవాద నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. చిట్యాల పట్టణం, మండలానికి చెందిన జాతీయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ సన్మాన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

Sthanikam

జాతీయవాదుల సంఘం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news