అనంతపురం: రాప్తాడు ఘటనలో పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు హేమంత్‌కు వైద్యులు రాత్రి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆపరేషన్ చేసి, అతడి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లను తొలగించింది.
శస్త్రచికిత్స అనంతరం హేమంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అతడిని ఏఎంసీ వార్డుకు తరలించారు. పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి