యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన క్రీస్తుశేషులు కొండ పెద్ద వీరస్వామి గౌడ్ మనవరాలు, ఆంజనేయులు గౌడ్ – సరిత దంపతుల ద్వితీయ పుత్రిక రమ్యకృష్ణ, వినీత్ గౌడ్‌ల రిసెప్షన్ వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
రాధిక థియేటర్ సమీపంలోని వోర్ల కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు నిదానపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రముఖులు, బంధుమిత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొండ బాబు గౌడ్ ,కొండ అనిల్ గౌడ్,కొండ శ్రీనివాస్ గౌడ్, కొండ సంతోష్ కుమార్ గౌడ్, కొండ వెంకటేశం గౌడ్ ,బొడ్డుపల్లి మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి