Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

కలితో ఉన్నవారికి అన్నదానమే అండ! సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కండి.. దాతలకు రెడ్డి టూ సర్వ్ ఫౌండేషన్ పిలుపు

Updated : 02 Nov 2026 04:33 IST
As Preferred Source 1 min read
కలితో ఉన్నవారికి అన్నదానమే అండ! సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కండి.. దాతలకు రెడ్డి టూ సర్వ్ ఫౌండేషన్ పిలుపు

ఆకలితో ఉన్నవారికి అన్నదానమే అండ!

సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కండి.. దాతలకు రెడ్డి టూ సర్వ్ ఫౌండేషన్ పిలుపు

హైదరాబాద్, నవంబర్ 2: స్థానికం ప్రతినిధి

సేవా భావంతో పేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా రెడ్డి టూ సర్వ్ ఫౌండేషన్, నవదీప ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద చికిత్స కోసం వచ్చిన పేద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది భోజనాలు స్వీకరించారు. పలువురు స్వచ్ఛంద సేవకులు పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఆకలితో ఉన్నవారికి అండగా..

సమాజంలో ఆకలితో బాధపడుతున్న పేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అన్నదానం ద్వారా తమకు సహాయం అందించిన నిర్వాహకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

దాతలు, సేవకులు ముందుకు రావాలి

ఈ సందర్భంగా రెడ్డి టూ సర్వ్ ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ.. సమాజ సేవలో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు తమను సంప్రదించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందిస్తే మరింత మంది నిరుపేదలకు అండగా నిలవవచ్చని అన్నారు. సేవా కార్యక్రమాలకు దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని కోరారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి