చిట్యాల: పట్టణంలోని MPL ఫ్యాక్టరీ, రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆధ్వర్యంలో నాయకులు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న నల్లటి దుమ్ము, పొగ, రసాయన వాసనతో పాటు రైస్ మిల్లుల వరి పొట్టు కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో తక్షణ తనిఖీలు నిర్వహించాలని, డస్ట్ ఫిల్టర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయించాలని, కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సుంచు శ్రీనివాస్, కన్నెబోయిన మహాలింగం యాదవ్, చికిలమెట్ల అశోక్, పల్లె వెంకన్న గౌడ్, జయరాపు రామకృష్ణ, గంజి గోవర్ధన్, గోషిక వెంకటేశం, ఈడుదల మల్లేష్, కంచర్ల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి