హస్తినాపురం పరిధి జడ్పీ రోడ్డు, వైభవ్ కిచెన్ సమీపంలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ‘లెగసీ యూనిసెక్స్ సెలూన్’ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు సత్యం రాజేష్, ప్రముఖులు నవీన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి సెలూన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మంజుల-సంజీవ సమక్షంలో, గడల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుక కన్నులపండువగా జరిగింది.
ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం, వ్యక్తిగత సౌందర్య సంరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఒకే చోట మహిళలు, పురుషులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బ్యూటీ కేర్ సేవలను అందుబాటులోకి తేవడం అభినందనీయమంటూ సెలూన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
కస్టమర్ల సంతృప్తే ధ్యేయం.. ప్రారంభ ఆఫర్‌గా 30 శాతం రాయితీ:
సెలూన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. "మా 'లెగసీ యూనిసెక్స్ సెలూన్'లో కస్టమర్ల సంతృప్తే ధ్యేయంగా హెయిర్ కట్ & స్టైలింగ్, స్కిన్ కేర్ ట్రీట్‌మెంట్స్, ప్రొఫెషనల్ మేకప్, నెయిల్ ఆర్ట్ వంటి అన్ని రకాల సేవలను అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులచే అందిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నాణ్యమైన బ్యూటీ ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తున్నాం" అని తెలిపారు.
ఈ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా వినియోగదారుల కోసం అన్ని సేవలపై 30 శాతం ప్రత్యేక ప్రారంభోత్సవ రాయితీ కల్పిస్తున్నామని, స్థానిక ప్రజలు, సౌందర్య ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అపాయింట్‌మెంట్లు, పూర్తి వివరాల కోసం 9063475656 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు, పలువురు స్థానిక ప్రముఖులు, శ్రేయోభిలాషులు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి