Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

వృద్ధులకు అండగా ‘దయ’.. రెండో బ్రాంచ్ ప్రారంభం!

Updated : 01 Nov 2026 20:21 IST
As Preferred Source 1 min read
వృద్ధులకు అండగా ‘దయ’.. రెండో బ్రాంచ్ ప్రారంభం!

హయత్‌నగర్ బంజారా కాలనీలో ఘనంగా ప్రారంభోత్సవం

వృద్ధుల సేవే మానవత్వానికి ప్రతీక: ప్రముఖులు

హయత్‌నగర్, నవంబర్ 1 (స్థానికం):

వృద్ధాప్యంలో ఆదరణ కోల్పోయిన వారికి అండగా నిలవడం, ఆప్యాయతతో కూడిన సేవలు అందించడం గొప్ప మానవతా కార్యమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్ బంజారా కాలనీలో నిర్వహిస్తున్న ‘దయ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్’ రెండో బ్రాంచ్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. సంస్థ మూడో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నూతన బ్రాంచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, ప్రముఖ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్, గీత పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ గౌడ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు.

వృద్ధుల పట్ల నిర్లక్ష్యం తగదు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కన్నవారిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం, ఆదరణకు దూరం చేయడం బాధాకరమన్నారు. వృద్ధులకు మెరుగైన వసతి, పౌష్టికాహారం, వైద్య సేవలు అందిస్తూ ఆత్మీయతను పంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా దయ ఓల్డ్ ఏజ్ హోమ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సేవాభావం ఉన్నవారు ఇలాంటి సంస్థలకు తమవంతు సహకారం అందించాలని కోరారు.

వృద్ధుల సేవే జీవిత లక్ష్యం: మానస

ఆశ్రమ నిర్వాహకురాలు మానస మాట్లాడుతూ.. వృద్ధులకు కుటుంబ వాతావరణంలో సేవలు అందించాలనే సంకల్పంతో మూడేళ్ల క్రితం ఆశ్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సమాజం నుంచి లభించిన ప్రోత్సాహంతో రెండో బ్రాంచ్‌ను ప్రారంభించామని చెప్పారు. ఆశ్రమంలో 24 గంటల వైద్య నిపుణుల పర్యవేక్షణ, ఫిజియోథెరపీ, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తమపై నమ్మకంతో వృద్ధుల బాధ్యతలను అప్పగిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. చివరి శ్వాస వరకు వృద్ధుల సేవకే అంకితమవుతానని భావోద్వేగంగా పేర్కొన్నారు.

ప్రముఖుల హాజరు

కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి, సంస్థ డైరెక్టర్ రఘురాం గౌడ్, మహ్మద్ రఫీక్, జనగాం శ్రీనివాస్ గౌడ్, జనగాం పాండు గౌడ్, సావిత్రి, బీసీ సంఘాల నాయకులు స్వామి కుమార్, నీల లింగస్వామి, పాలకూరి లింగస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వృద్ధులకు అండగా ‘దయ’.. రెండో బ్రాంచ్ ప్రారంభం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news