కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సమరయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి పాల్గొని ముందుగా చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. తదనంతరం విద్యార్థుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఆత్మగౌరవ దిక్కార స్వరం, తెలంగాణ సోయికి నిలువెత్తు నిదర్శనం,సామాజిక వికాసానికి నాంది పలికిన వీరనారి ఐలమ్మ అని, తను పండించిన పంట కోసం, ఆత్మగౌరవం కోసం దొరల దౌర్జన్యాలకి, దొరల తూటాలకి, ఎదురు నిలబడి విప్లవ బడబాగ్నిని రగిలించింది చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు. అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ అని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన చాకలి ఐలమ్మ ఈనాటి యువతకు ఆదర్శమని, అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆమె మార్గంలో నడవాలని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలు, కన్నీళ్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని విజయం సాధించిందని ఇలాంటి చరిత్రను భావితరాల వారికి అందించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చైతన్య కార్యక్రమాలను అంతట నిర్వహించాలని ఆయన అన్నారు. ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రణబోతు పిచ్చి రెడ్డి,జి.యాదగిరి, బి.బల భీమారావు,ఆర్.రమేష్,పి.రాజేష్, యం.రత్నకుమారి,బి.రమేష్ బాబు,కె. రామరాజు,జి.రవి కిరణ్,కె.సతీష్,జి. నాగరాజు,ఈ. నరసింహారెడ్డి,జె. తిరుపతయ్య, ఎస్.కె.ఆరిఫ్ అలీ, కళ్యాణి, కలకొండ శాంతయ్య,ఎన్. జ్యోతిలక్ష్మి, టి.మమత, ఆర్.చంద్రశేఖర్, ఎస్.వెంకటేశ్వర చారి,టి.మమత, డి.ఎస్.రావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
"స్త్రీ ధైర్యశాలి ఐలమ్మ"
"స్త్రీ ధైర్యశాలి ఐలమ్మ"
Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి