Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

సరైన ప్రణాళికతో చదివితే విజయం తథ్యం

Updated : 04 Nov 2026 17:12 IST
As Preferred Source 1 min read
సరైన ప్రణాళికతో చదివితే విజయం తథ్యం

పోలీసు ఉద్యోగాల ఆశావహులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ సూచించారు.బుధవారం కోదాడ కేఆర్‌ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా 200 మంది అభ్యర్థులకు 11 పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్‌ను అధికారులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలని, గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి కనీసం మూడుసార్లు రివిజన్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 400 మందికి ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.ఎస్పీ నరసింహ మాట్లాడుతూ..యువత అనవసర వ్యాపకాలకు దూరంగా ఉండి నిరంతరం సాధన చేయాలని, కష్టపడి చదివి పోలీసు ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు.అనంతరం సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది అభ్యర్థులకు ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించారు.అధికారులు సైబర్ సెక్యూరిటీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రామారావు, శివకుమార్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ఎమ్మార్వో సాయి, ఆర్ఎస్ఐలు సాయిరాం,సురేష్,అన్వర్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.

Sthanikam

సరైన ప్రణాళికతో చదివితే విజయం తథ్యం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి