Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / తాజా వార్తలు

చదువుతో పాటు భద్రతపై అవగాహన అవసరం: ఎస్సై మల్లేష్

Updated : 04 Nov 2026 18:28 IST
As Preferred Source 1 min read
చదువుతో పాటు భద్రతపై అవగాహన అవసరం: ఎస్సై మల్లేష్

విద్యార్థినుల భద్రత, సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా కోదాడ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో బుధవారం కోదాడ పట్టణంలోని నయానగర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా షీ టీమ్స్ ఎస్‌ఐ మల్లేష్ మాట్లాడుతూ..విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్‌లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు.అలాగే మహిళల రక్షణకు అందుబాటులో ఉన్న చట్టాలు, షీ టీమ్స్ సేవల గురించి వివరించారు. సైబర్ మోసాలు జరిగితే 1930కు, అత్యవసర పోలీస్ సహాయం కోసం 112కు ఫోన్ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

చదువుతో పాటు భద్రతపై అవగాహన అవసరం: ఎస్సై మల్లేష్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి