మిత్రుడి స్వయం ఉపాధికి రూ.35 వేల ఆర్థిక సాయం.
చిట్యాల: చిన్ననాటి స్నేహానికి వయసుతో సంబంధం లేదని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన 2002–03 టెన్త్ క్లాస్ మిత్రబృందం చాటిచెప్పింది. రెండు దశాబ్దాలు గడిచినా తమ మధ్య ఆప్యాయతను కొనసాగిస్తూ, కష్టాల్లో ఉన్న మిత్రుడికి అండగా నిలిచారు. తమ మిత్రుడు బత్తుల శ్రీకాంత్‌కు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో సుమారు రూ.35 వేల ఆర్థిక సహకారం అందించి స్వీట్ అండ్ మిక్చర్ బండి వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. ఇది కేవలం వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన బండి కాదని, తమ స్నేహానికి ప్రతీకగా, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. కష్టకాలంలో మిత్రుడికి అండగా నిలిచి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాంత్ ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు నీలకంఠం లింగస్వామి, సాగర్ల నాగరాజు, గుండెపురి లింగస్వామి, చేకూరి గణేష్, గుత్తా కుశల్ కుమార్ రెడ్డి, ఎడ్ల రాములు, ఏర్పుల పరమేష్, గుండెపురి శేఖర్, గుండెపురి కృష్ణతో పాటు పలువురు మిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి