Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

సామాజిక సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ ఓం ప్రకాశ్‌కు గుర్తింపు

Updated : 21 Jan 2026 16:21 IST
As Preferred Source 1 min read
సామాజిక సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ ఓం ప్రకాశ్‌కు గుర్తింపు

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ప్రఖ్యాత సామాజిక సేవకర్త, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలింగ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సేవలందిస్తున్న డాక్టర్ డి. ఓం ప్రకాశ్ ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా, నారాయణఖేడ్ ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ, డాక్టర్ డి. ఓం ప్రకాశ్ చేస్తున్న సామాజిక సేవలను కొనియాడారు. మానవ హక్కుల పరిరక్షణ, పేదల సహాయం, సమాజంలో న్యాయం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నేటి యువతి, యువకులు సామాజిక సేవలలో చురుకుగా పాల్గొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.డాక్టరేట్ పొందిన సందర్భంగా తనను శాలువాతో సన్మానించిన ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణకు డాక్టర్ డి. ఓం ప్రకాశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను కల్పించిందని, భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో కొనసాగుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాములు, ఓం ప్రకాశ్, షాబాద్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ ఓం ప్రకాశ్‌కు గుర్తింపు

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news