భువనగిరి: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బడ్జెట్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి-స్మార్ట్) ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక వివేరా హోటల్‌లో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
బి-స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కొండూరి మల్లేష్‌గౌడ్ అధ్యక్షత వహించారు. జిల్లాలోని 97 ప్రైవేట్ పాఠశాలల్లో సేవలందిస్తున్న ఉపాధ్యాయుల్లో పలువురిని 2026–27 బెస్ట్ టీచర్ అవార్డులకు ఎంపిక చేసి సత్కరించారు.
కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బి-స్మార్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, మెమెంటోలు అందజేసి అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల సేవలను వారు కొనియాడారు. ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ చైర్మన్ అవేస్, పీఏసీఎస్ చైర్మన్ కొండల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, బి-స్మార్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణరెడ్డి, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సింగనబోయిన మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, కోశాధికారి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి కీర్తి, కోశాధికారి ప్యారీ బేగం, వివిధ మండలాల అధ్యక్షులు, పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి