Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 10:10 AM

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ బి. అనురాధ

23-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి: గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా ఎల్‌బీ నగర్ డీసీపీ బి. అనురాధ, ఐపీఎస్ ఆధ్వర్యంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎస్‌ఆర్‌ఎల్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను డీసీపీ బి. అనురాధ, ఐపీఎస్ సందర్శించి మండపాల నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు, ఓటీపీ మోసాలు, కేవైసీ పేరుతో మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

OTP, UPI PIN, పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని డీసీపీ అనురాధ సూచించారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీసీపీ ఎస్‌వీ. నాగలక్ష్మి, ఎల్‌బీ నగర్ ఏసీపీ పి. రవీందర్ రెడ్డి, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ కె. సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ బి. అనురాధ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News