Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమంగా తరలిస్తున్న 7 గోవులు, 3 నందిమారాజులు స్వాధీనం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 09:07 AM

రూ.28,500కు వినాయకుడి లడ్డూ వేలం

రూ.28,500కు వినాయకుడి లడ్డూ వేలం

రూ.28,500కు వినాయకుడి లడ్డూ వేలం
25-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెలిమినేడు: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం 9వ వార్డులో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలంలో వరికుప్పల విగ్నేష్ రూ.28,500కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. గణనాథుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలు ఐక్యంగా ఇలాంటి ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.అనంతరం త్రిశూల్ యూత్ సభ్యులు వరికుప్పల విగ్నేష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోలి నరేష్, రూపని అజిత్, వడ్డేపల్లి పనుసు, త్రిశూల్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

రూ.28,500కు వినాయకుడి లడ్డూ వేలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News