నిమజ్జనం చూసేందుకు వెళ్తుండగా ఢీకొట్టిన కారు
లింగోజిగూడెం జాతీయ రహదారిపై విషాదం
జాతీయ రహదారి 65పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విదేశీ ప్రాంతానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాంబియాష్ కేవత్ (37, తండ్రి: గోపాల్ కేవత్) గత రెండు నెలలుగా లింగోజిగూడెంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న ఓ చిన్న టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో ఈనెల 23న (బుధవారం) రాత్రి 10 గంటల సమయంలో గణేష్ నిమజ్జన వేడుకలను చూసేందుకుగాను విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని దాటుతుండగా.. విజయవాడ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు (TS 09 FQ 1881) అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంబియాష్ తలకు, శరీరానికి తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.టిఫిన్ సెంటర్ యజమాని ప్రభు చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ మన్మధ కుమార్ వెల్లడించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి