Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:00 AM

రేపు ఘనంగా జరగనున్న ఊరడమ్మ, పాపమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ బోనాలు

30-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామంలో శ్రీ ఊరడమ్మ మరియు శ్రీ పాపమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ బోనాల పండుగను మే 1వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు, గ్రామస్థులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా జరిగే ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గురువారం రాత్రి గ్రామమంతా భజన కళాకారులతో భక్తి గీతాల మధ్య భజన కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. అనంతరం శుక్రవారం ఉదయం శ్రీ ఊరడమ్మ అమ్మవారి బోనాలు, సాయంత్రం శ్రీ పాపమ్మ అమ్మవారి బోనాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పండుగలో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు.

Sthanikam

రేపు ఘనంగా జరగనున్న ఊరడమ్మ, పాపమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ బోనాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News