Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గానికి బాపు మల్ శెట్టి ఘన సన్మానం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 29, 2026 09:19 PM

రేజింతల్ సిద్ది వినాయక ఆలయ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

29-09-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా రేజింతల్‌లోని సిద్ది వినాయక ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆలయాన్ని సందర్శించి భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రాకపోకలు, క్యూలైన్ల నిర్వహణ, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించిన ఎస్పీ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరిస్తూ క్రమశిక్షణతో క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్లేలా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, రూరల్ ఇన్‌స్పెక్టర్ హనుమంతు, ఎస్‌ఐలు సుజిత్, క్రాంతి పాటిల్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రేజింతల్ సిద్ది వినాయక ఆలయ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News