Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:48 AM

రావి ఆకుపై శ్రీరాముడి అద్భుత చిత్రాలు… రామన్నపేట మహిళ భక్తి ప్రతిభ

29-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: శ్రీరామనవమి సందర్భంగా రామన్నపేటకు చెందిన కళ్లెం ధనోజ తన భక్తిని విశేషంగా చాటుకున్నారు. సాధారణంగా చిత్రాలు కాగితంపై గీయడం సహజం. అయితే ధనోజ మాత్రం విభిన్నంగా ఆలోచించి, రావి ఆకుపై శ్రీరామచంద్ర స్వామి అద్భుత చిత్రాన్ని చెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆకుపై శ్రీరాముడు విల్లు, బాణాలతో నిల్చున్న తీరు ఎంతో సజీవంగా కనిపిస్తోంది. ఒక చేత్తో ధనుస్సును పట్టుకుని, భుజానికి బాణాలు తగిలించుకున్న శైలి ఆకట్టుకుంటోంది. అదే ఆకుపై ‘Sri Ram’ అని ఆంగ్ల అక్షరాల్లో కూడా లిఖించడం ప్రత్యేకతగా నిలిచింది. మరో ఆకుపై కూర్చొని ఆకాశం వైపు విల్లు ఎక్కుపెట్టిన శ్రీరాముడి రూపాన్ని సైతం నైపుణ్యంతో చిత్రించారు.

స్థానికులు ఈ కళను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. భక్తి, ప్రతిభ కలిసిన ఈ సృజన శ్రీరామనవమి వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Sthanikam

రావి ఆకుపై శ్రీరాముడి అద్భుత చిత్రాలు… రామన్నపేట మహిళ భక్తి ప్రతిభ

Article Image

రామన్నపేట: శ్రీరామనవమి సందర్భంగా రామన్నపేటకు చెందిన కళ్లెం ధనోజ తన భక్తిని విశేషంగా చాటుకున్నారు. సాధారణంగా చిత్రాలు కాగితంపై గీయడం సహజం. అయితే ధనోజ మాత్రం విభిన్నంగా ఆలోచించి, రావి ఆకుపై శ్రీరామచంద్ర స్వామి అద్భుత చిత్రాన్ని చెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆకుపై శ్రీరాముడు విల్లు, బాణాలతో నిల్చున్న తీరు ఎంతో సజీవంగా కనిపిస్తోంది. ఒక చేత్తో ధనుస్సును పట్టుకుని, భుజానికి బాణాలు తగిలించుకున్న శైలి ఆకట్టుకుంటోంది. అదే ఆకుపై ‘Sri Ram’ అని ఆంగ్ల అక్షరాల్లో కూడా లిఖించడం ప్రత్యేకతగా నిలిచింది. మరో ఆకుపై కూర్చొని ఆకాశం వైపు విల్లు ఎక్కుపెట్టిన శ్రీరాముడి రూపాన్ని సైతం నైపుణ్యంతో చిత్రించారు.

స్థానికులు ఈ కళను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. భక్తి, ప్రతిభ కలిసిన ఈ సృజన శ్రీరామనవమి వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News