Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వచ్ఛతా హీ సేవలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 05:22 PM

రాష్ట్ర స్థాయి మల్కంబ్‌ పోటీలకు రాధే శ్యామ్‌ ఎంపిక

30-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ట్రినిటీ హైస్కూల్‌ ప్రాంగణంలో బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ (స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) అండర్‌-17 మల్కంబ్‌ ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.​ఈ ఎంపికల్లో తంగడపల్లి గ్రామానికి చెందిన ఊదరి శ్యామ్‌ సుందర్‌, లావణ్య దంపతుల కుమారుడు ఊదరి రాధే శ్యామ్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇతడు తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ మల్కంబ్‌ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.​ఈ సందర్భంగా చౌటుప్పల్‌ మండల విద్యాధికారి (ఎంఈవో) గురువారావు మాట్లాడుతూ.. మల్కంబ్‌ వంటి సాంప్రదాయ భారతీయ క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, సమతుల్యత, ఏకాగ్రత, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో పీఈటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎస్‌జీఎఫ్‌ మండల కార్యదర్శి లింగయ్య, జెడ్పీహెచ్‌ఎస్‌ కోయలగూడెం ఉపాధ్యాయుడు మట్టయ్య, ట్రినిటీ హైస్కూల్‌ చైర్మన్‌ కె.వి.బి. కృష్ణారావు, ప్రిన్సిపాల్‌ ఉజ్జిని మంజుల, తెలంగాణ మల్కంబ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం. గోపాల్‌, వివిధ పాఠశాలల పీఈటీలు పాల్గొని విజేత రాధే శ్యామ్‌ను అభినందించారు.

Sthanikam

రాష్ట్ర స్థాయి మల్కంబ్‌ పోటీలకు రాధే శ్యామ్‌ ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News