Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారీ వర్షాలు.. నేడు పాఠశాలలకు సెలవు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 10:18 AM

రాంనగర్ లో కన్నుల పండువగా భక్తజన సంద్రం.. ఘనంగా వినాయక వేడుకలు!

24-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విశేష పూజలు, ఘనంగా అన్నదానం

పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, సీఐ మన్మధ కుమార్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు, రాంనగర్ కాలనీలో 'రాంనగర్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం 10వ రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని బుడ్డ కృష్ణ - గంగమ్మ దంపతుల కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.​ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, సీఐ మన్మధ కుమార్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.​అనంతరం 'గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్' లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాక చిరంజీవి, ఎండీ హన్ను, చెరుకు శివ, చింతల సాయిలు, కాలనీవాసులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొత్తోజు వెంకట చారి, కమిటి సభ్యులు, చౌటుప్పల్ పట్టణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, గణేష్ మండపం వద్ద స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Sthanikam

రాంనగర్ లో కన్నుల పండువగా భక్తజన సంద్రం.. ఘనంగా వినాయక వేడుకలు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News