Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

రామన్నపేటలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ కల్పించాలి.ఎంపీ ఆర్. కృష్ణయ్యకు బీజేపీ నాయకుల వినతి.

Updated : 21 Nov 2026 16:50 IST
As Preferred Source 1 min read
 రామన్నపేటలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ కల్పించాలి.ఎంపీ ఆర్. కృష్ణయ్యకు బీజేపీ నాయకుల వినతి.

రామన్నపేట, నవంబర్ 21: స్థానికం ప్రతినిధి

రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు తిరిగి హాల్ట్ కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యకు బీజేపీ నాయకుడు పల్లపు దుర్గయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

కరోనా కంటే ముందు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు రామన్నపేట రైల్వే స్టేషన్‌లో ఆగేదని, ప్రస్తుతం హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. రామన్నపేటతో పాటు వలిగొండ, చిట్యాల మండలాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ప్రయాణికులు, భక్తులు, ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారుల సౌకర్యార్థం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కు రామన్నపేటలో హాల్ట్ పునరుద్ధరించేలా సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆర్. కృష్ణయ్యను కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పల్లగుండ్ల రాందేవ్, బీసీ యువజన నాయకుడు పల్లపు రవి, బీజేవైఎం నాయకుడు గండికోట హరికృష్ణ పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి