సదాశివపేట పట్టణంలోని 19వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం నమోదు ప్రక్రియను
వార్డు కౌన్సిలర్ పట్లూరి రోజా గౌడ్ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఇందిరమ్మ భీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, అర్హతలు, ప్రయోజనాల గురించి వివరించారు. లబ్ధిదారులకు పథకంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. రేషన్ కార్డులో పేర్లు కలిగి ఉండి, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఈ పథకానికి అర్హులని తెలిపారు.
ఈ నమోదు కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.
కావున 19వ వార్డులోని అర్హులైన ప్రతి కుటుంబ సభ్యుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో
వార్డ్ ఆఫీసర్ మన్మోహన్, సతీష్ కుమార్, ఆర్ పి ఉమా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పట్లూరి నాగరాజుగౌడ్,వార్డు ప్రజలు సలీం,తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి