చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం హుండీలను ఈ నెల 27వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఒక ప్రకటనలో తెలిపారు.దేవదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణాధికారి, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఆలయ ఛైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, దాతలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి