Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి!

Updated : 21 Nov 2026 15:31 IST
As Preferred Source 1 min read
మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి!

చేప పిల్లల పంపిణీతోపాటు వలలు, తెప్పలు, వాహనాలు సబ్సిడీపై అందించాలి.

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో కందుల హనుమంతు.

రామన్నపేట, నవంబర్ 21: స్థానికం ప్రతినిధి:

మత్స్య సంపద ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చడంలో మత్స్యకారుల పాత్ర కీలకమని మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కందుల హనుమంతు అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని మత్స్య సహకార సంఘం కార్యాలయం ఎదుట ఆయన జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. మత్స్యకారుల పిల్లలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పంపిణీ చేయడంతోపాటు వలలు, తెప్పలు, ఐస్ బాక్సులు, బొలెరో వాహనాలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వారికి అవసరమైన వృత్తిపరమైన పరికరాలు, రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మత్స్యకారుల శ్రమకు తగిన గుర్తింపు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.ప్రభుత్వ ఆదాయానికి తోడ్పడుతున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం కార్యదర్శి పిట్టల మత్స్యగిరి, మాజీ డైరెక్టర్ యాట ఇస్తారి, బచ్చ రాములు, రేపాక పోచమ్మ, కేశబోయిన మంగమ్మ, భైరబోయిన శోభ, యాట భాగ్యమ్మ, యాట అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news