తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా" పథకం (కుటుంబానికి 5 లక్షల రూపాయలు)లో భాగంగా తాజ్ పూర్ గ్రామంలో ఈ రోజు
తాజ్ పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీమతి&శ్రీ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేతుల మీదుగా అర్హులైన కుటుంబాలకు మంజూరు ధ్రువీకరణ పత్రాలు అందజేసి ప్రారంభించడం జరిగింది..ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా మండల ప్రత్యేక అధికారి శ్రీ శ్యాం సుందర్ , ఎంపీవో శ్రీ దినకర్ పాల్గొన్నారు... ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ...18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపు, రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి ఈ 5లక్షల రూపాయల భీమా సౌకర్యం పొందడానికి అర్హులు గా నిర్ణయించడం జరిగింది అని అందుకు గాను ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలతో వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ..ఈ ప్రక్రియ 15రోజుల పాటు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతుంది అని గ్రామ ప్రజలు ఆందోళన చెందకుండా సిస్టమ్ ఆపరేటర్ కు సహకరించి దరఖాస్తు చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు...ఈ సందర్బంగా విచ్చేసిన మండల అధికారులు గ్రామంలో కొనసాగుతున్న VBGRAMG పథకం క్రింద మంజూరైనా ఉపాధి హామీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది..కార్యక్రమంలో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్ , పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు, గ్రామప్రజలు పాల్గొన్నారు...
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి