అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా.. 15 రోజుల పాటు నమోదు.
తాజ్‌పూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణను సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ దంపతులు గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి శ్యామ్ సుందర్, ఎంపీవో దినకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు కలిగి రేషన్ కార్డు ఉన్న అర్హులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు తెలిపారు. ఆధార్, రేషన్ కార్డులతో గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని, 15 రోజుల పాటు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి