Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

25న ఆందోల్ మైసమ్మ ఆలయ దుకాణాల వేలం

Updated : 21 Nov 2026 15:44 IST
As Preferred Source 1 min read
25న ఆందోల్ మైసమ్మ ఆలయ దుకాణాల వేలం

కొబ్బరి కాయలు, పూజా సామాగ్రి విక్రయ హక్కుల కోసం నిర్వహణ

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో కొబ్బరి కాయలు, పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు (లైసెన్స్) కోసం ఈ నెల 25వ తేదీ (బుధవారం) ఉదయం 11:30 గంటలకు సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 12న నిర్వహించాల్సిన వేలం వాయిదా పడటంతో తిరిగి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

​ముఖ్య వివరాలు, నిబంధనలు:

​కాలపరిమితి: 2027 జనవరి 14 నుండి 2028 జనవరి 13 వరకు (ఒక సంవత్సరం).

​ధరావత్తు (ఈఎండి), షెడ్యూల్: వేలంలో పాల్గొనేవారు రూ.5,00,000 ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ షెడ్యూల్ ధర రూ.1,000.​

డీడీ వివరాలు: ధరావత్తు మొత్తాన్ని ఏదైనా జాతీయ బ్యాంకు నుండి 'కార్యనిర్వహణాధికారి, శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానము, దండుమల్కాపురం' పేరున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (చౌటుప్పల్ బ్రాంచ్ కోడ్: 81265) లేదా తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు (మల్కాపుర్ బ్రాంచ్ కోడ్: 6316) లో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీయాలి.

​చెల్లింపు షరతులు: హెచ్చు పాటదారుడు వేలం ఖరారైన 48 గంటల్లోపు పాట మొత్తంలో సగం (1/2 వంతు) చెల్లించాలి (ధరావత్తు కాకుండా). లేనిపక్షంలో ధరావత్తు జప్తు చేసి రెండో హెచ్చు పాటదారుడికి అవకాశం ఇస్తారు. మిగిలిన మొత్తానికి బ్యాంకు గ్యారంటీ లేదా చెక్కులు సమర్పించి, దుకాణం స్వాధీనం చేసుకున్న 45 రోజుల్లోపు పూర్తి సొమ్ము చెల్లించాలి.​దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఛైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో వేలం జరుగుతుందని, మరిన్ని వివరాలకు 90309 32493 నంబరులో సంప్రదించాలని ఆలయ వర్గాలు కోరాయి.

Sthanikam

25న ఆందోల్ మైసమ్మ ఆలయ దుకాణాల వేలం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news