ఆపద సమయంలో అండగా నిలిచే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
23వ వార్డులో నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ బర్రె పూజిత-మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్
భువనగిరి టౌన్: పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించి,కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు.శనివారం భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కుటుంబ పెద్ద అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయాన్ని కల్పిస్తోందని తెలిపారు.రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కార్మికులు,రోజువారీ కూలీలు, ఆటో కార్మికులు,ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే పేద కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా కల్పించే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి..18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు సమయంలో బీమా పొందే వ్యక్తి వ్యక్తిగత వివరాలతో పాటు నామినీ వివరాలను కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరవేయడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి అధికారి ఎండి.ఫారాత్ బేగం,ఆర్పీలు సుదర్శన,మంజుల,ముత్యాల అనిల్ కుమార్,కొండమడుగు రాము,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ -జి.శ్రీనివాస్.✍️
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి