Sthanikam - Truth Matters
Logo

దారితప్పిన చిన్నారులకు పోలీసుల అండ

Updated : 21 Nov 2026 17:27 IST
As Preferred Source 1 min read
దారితప్పిన చిన్నారులకు పోలీసుల అండ

రెండు గంటల పాటు గాలించి తల్లి ఒడికి చేర్చిన నల్గొండ 2 టౌన్ పోలీసులు.

నల్గొండ: ఆటల్లో పడి దారితప్పిన ఇద్దరు చిన్నారులను నల్గొండ 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. పోలీసుల మానవీయ స్పందనకు స్థానికుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

నల్గొండ పట్టణంలోని మాన్యంచెల్క ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆటల్లో పడి దారి తప్పి విద్యానగర్‌లోని వసుధ టవర్స్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ లిఫ్ట్‌లో ఆడుకుంటున్న చిన్నారులను గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు వివరాలు అడగగా, హిందీలో మాట్లాడుతున్న వారు తమ ఇంటి చిరునామా చెప్పలేకపోయారు. దీంతో కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.ఎస్సై సైదాబాబు ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు ఎంఏ ఫరూక్, స్వామి వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అపార్ట్‌మెంట్ వాసులు చంద్రశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డిల సహకారంతో బీటీఎస్, మాన్యంచెల్క ప్రాంతాల్లోని పలు వీధుల్లో దాదాపు రెండు గంటల పాటు వెతికారు.

ఈ క్రమంలో మాన్యంచెల్కలోని ఓ అంగన్వాడీ కేంద్రం వద్ద ఇద్దరు పిల్లల కోసం వెతుకుతున్నారనే సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారులను అంగన్వాడీ నిర్వాహకురాలికి చూపించగా, ఆమె గుర్తించి వారి ఇంటికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి పిల్లల కోసం ఆందోళన చెందుతున్న తల్లికి పోలీసులు చిన్నారులను క్షేమంగా అప్పగించారు. బిడ్డలను తిరిగి చూసుకున్న తల్లి ఆనందంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.చిన్నారుల క్షేమమే లక్ష్యంగా ఓపికతో శ్రమించి వారిని తల్లి చెంతకు చేర్చిన కానిస్టేబుళ్లు ఫరూక్, స్వామిలను స్థానికులు అభినందించారు.

Sthanikam

దారితప్పిన చిన్నారులకు పోలీసుల అండ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి