25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం.
వెలిమినేడు: గ్రామంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి సన్నిధానానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని అయ్యప్ప స్వాములు చేసిన విజ్ఞప్తికి నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్పందించారు. సన్నిధానంలో విద్యుత్ సదుపాయం లేక స్వాములు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వెలిమినేడు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అంశల సత్యనారాయణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తక్షణమే స్పందించి 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడంతో పాటు అవసరమైన నిధులు కేటాయించారు.
సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే వేముల వీరేశానికి అయ్యప్ప స్వాములు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కర్దూరి అంజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొంపల్లి వెంకట్‌రెడ్డి, చీమల వీరేశం, అంతటి నర్సింహగౌడ్, అంతటి సత్తయ్యగౌడ్, మాజీ అధ్యక్షుడు సుర్కంటి సత్తిరెడ్డి, గోలి గణేష్, దేశబోయిన మల్లేశ్ యాదవ్, అంతటి రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి