బీఆర్‌ఎస్ అధిష్ఠానానికి బీసీ విద్యార్థి సంఘం విజ్ఞప్తి.
హైదరాబాద్: రాబోయే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్‌ను పరిశీలించాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి కుమార్ సూర్యావంశీ కోరారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయనకు ప్రజా సమస్యలపై అవగాహనతో పాటు న్యాయపరమైన పరిజ్ఞానం ఉందన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంతో అనుబంధం కలిగిన రామ్ నరసింహ గౌడ్ బీఆర్‌ఎస్‌వీతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ కీలకంగా పనిచేశారని తెలిపారు. గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు. 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సమన్వయంతో పాటు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేశారని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, హైడ్రా, మూసీ, భూ సమస్యలు తదితర ప్రజా అంశాలపై రామ్ నరసింహ గౌడ్ స్పందిస్తున్నారని సాయి కుమార్ తెలిపారు. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, తెలంగాణ ప్రయోజనాలపై సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించేలా ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పరిశీలించాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి