అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో భాస్కర్ థియేటర్ వద్ద వేడుకలు
చౌటుప్పల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 13వ వార్డు రామ్ నగర్ కాలనీ, భాస్కర్ థియేటర్ సమీపంలో అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ గౌడ్, చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్, ఎస్సై యాదగిరి గౌడ్, హయత్‌నగర్ నీలాద్రి హాస్పిటల్ యాజమాన్యం పిసాటి జితేందర్ రెడ్డి, పిసాటి ఉపేందర్ రెడ్డి హాజరై తమ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎం.డి. హన్ను భాయ్, బాబా షరీఫ్, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, మంచింటి భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, అభ్యుదయ యూత్ గౌరవ అధ్యక్షులు తోర్పునూరి బాబు గౌడ్, అధ్యక్షులు చెవగొని వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మార్గం నరసింహ యాదవ్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కళ్యాణ్ నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి వర్కాల జయరాం గౌడ్, గౌరవ సలహాదారులు చెరుకు అశోక్ గౌడ్, వర్కాల కుమార్, ఎస్.కే. జానీ బాబు, వర్కాల రవి, సుర్వి అంజయ్య గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, ఊడుగు శ్రీనివాస్ గౌడ్, మంచింటి ఉపేందర్, తోర్పునూరి జంగయ్య గౌడ్, తోర్పునూరి పెద్ద మల్లేష్ గౌడ్, కమిటీ సభ్యులు, యూత్ ప్రతినిధులు వర్కాల వెంకటేష్ గౌడ్, ఉష్కాగుల జంగయ్య గౌడ్, తోర్పునూరి చంద్రయ్య పెద్ద గౌడ్, మొగుదాల రాములు, బాలగోని నరసింహ గౌడ్, చెరుకు అచ్చయ్య గౌడ్, చెరుకు శీను గౌడ్, కొరిమి శేఖర్ ముదిరాజ్, ఎర్రసాని శీను యాదవ్, చెరుకు రాము గౌడ్, సన్నీ చారి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి