నిరుపేదలకు ట్రస్ట్ ఎల్లప్పుడూ అండ: సెక్రటరీ ఖయ్యుం
రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు నిరుపేదలకు బుధవారం ఆర్థిక సాయం అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. కైతాపురం కు చెందిన కొలుకులపల్లి అంజయ్య, బి.సి. కాలని చౌటుప్పల్ కు చెందిన కుర్షీద్ బేగం, చౌటుప్పల్‌కు చెందిన భాతరాజు రమేష్‌లకు రూ. 15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ట్రస్ట్ సెక్రటరీ ఖయ్యుం, ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్లా నర్సింహ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సెక్రటరీ ఖయ్యుం మాట్లాడుతూ... సమాజంలో నిరుపేదలు, బాధితులకు రాజీవ్ స్మారక ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తమవంతుగా సేవలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపి సుధాకర్, తగరం నాగరాజు, ముద్దం చింటూ యాదవ్, ముద్దం పర్వతాలు, గుడ్డేటి ముత్యాలు, గోపనబోయిన ఎర్రయ్య, గోపన బోయిన ఆగయ్య, గుడ్డేటి యాదగిరి, కోలుకులపల్లి ప్రవీణ్, బత్తుల రాజు, ఎండీ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి