తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను మునగాల రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక అండర్ పాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నందు రజక సంఘం నాయకులు సిహెచ్ సీతారాం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి మునగాల రజక సంఘం అధ్యక్షుడు తంగెళ్ల నాగేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాటి నైజాం నవాబు పాలనలో విసునూరు రామచంద్రారెడ్డి దొర ఆగడాలను ఎదిరించినచాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడి, సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి రజకుజాతి గొప్పతనాన్ని దేశ ప్రజలకు తెలియజేసినదని, నేటికీ తెలంగాణ ప్రాంతంలో ఆమె పేరు వింటేనే ప్రతి ఒక్కరిలో సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తి రగులుతుందని, అలాంటి వీరవనిత వీరోచిత పోరాటం రజక జాతికి గర్వకారణమని, ఆమె పోరాటస్ఫూర్తిని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోతూ రజకులు తమ హక్కులకోసం ,తమజాతి రక్షణ కోసం రానున్న కాలంలో జరిగే
పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల రజక సంఘం నాయకులు ముక్కోళ్ల వెంకటేశ్వరరావు, తంగేళ్ల యాదగిరి, పాపారావు,శివ, వెంకన్న,గోవిందు,ఆటోవెంకటేశ్వర్లు,సాంబ, సందీప్ ,గరేపాకుల
నాగరాజు,రేపాకులకోటేశ్వరరావు,సిద్దుల శీను, వీరస్వామి, ప్రసాద్, శీను, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి