Sthanikam - Truth Matters
Logo

రజక కుటుంబాల్లో పింఛన్‌ వెలుగులు.. ఎనిమిది మందికి కొత్తగా మంజూరు!

Updated : 14 Nov 2026 07:24 IST
As Preferred Source 1 min read
రజక కుటుంబాల్లో పింఛన్‌ వెలుగులు.. ఎనిమిది మందికి కొత్తగా మంజూరు!

ప్రభుత్వానికి రజక సంఘం కృతజ్ఞతలు.

చిట్యాల: వెలిమినేడు గ్రామంలోని రజక కుటుంబాల్లో నూతన పింఛన్లు ఆనందాన్ని నింపాయి. ఎన్నో రోజులుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తాజాగా పింఛన్లు మంజూరు చేయడంతో ఆయా కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

నూతనంగా పింఛన్లు పొందిన వారిలో గోలి అనసూయ, గోలి మధు, గోలి నరసింహ, గోలి లలిత, వడ్డేపల్లి అంజయ్య, వడ్డేపల్లి పద్మ, వడ్డేపల్లి సంతోష, వడ్డేపల్లి ఉదయ్ కుమార్ ఉన్నారు.ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు పింఛన్లు ఎంతో భరోసానిస్తాయని, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఈ సాయం కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన రజక కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశానికి ఆయన రజక సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న చేయూత అభినందనీయమని పేర్కొన్నారు.

Sthanikam

రజక కుటుంబాల్లో పింఛన్‌ వెలుగులు.. ఎనిమిది మందికి కొత్తగా మంజూరు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి