Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంటైనర్ వాహనం ఢీకొని అదనపు కలెక్టర్‌ వాహనం ధ్వంసం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 10:14 AM

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన
28-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్‌: రైతులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేసి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా అవగాహన కల్పించేందుకు ‘రైతు బడి’కి శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్‌ చిత్ర లేఅవుట్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్‌ భవాని ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా తదితర కార్యక్రమాలను ప్రస్తావించారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని వారు విమర్శించారు.

‘రైతు బడి’ నిర్వాహకుడు, మాజీ వ్యవసాయ జర్నలిస్ట్‌ జూలకంటి రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ కాలంలో ఏ పంటలు సాగు చేయాలి, ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించాలి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఎలా సాధించాలనే అంశాలపై రైతులకు ప్రతిరోజూ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతికతను రైతులకు చేరువ చేయడమే ‘రైతు బడి’ లక్ష్యమని వివరించారు.

Sthanikam

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News